భారతదేశం, ఆగస్టు 6 -- R Madhavan GD Naidu Release: కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్. 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' చిత్రంలో ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రలో జీవించి, జాతీయ అవార్డును సైతం ముద్దాడిన ఆయన, ఇప్పుడు మరో మహానాయకుడి జీవిత కథతో వెండితెరపైకి వస్తున్నారు.

'ఎడిసన్ ఆఫ్ ఇండియా', 'మిరాకిల్ మేన్', 'వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్' అని పిలుచుకునే ప్రముఖ భారతీయ ఆవిష్కర్త, శాస్త్రవేత్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి.నాయుడు) స్ఫూర్తిదాయక జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'జీడీ నాయుడు' (GDN).

ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించారు. జీడీ నాయుడు జీవితంలోని వివిధ దశలను, ఆయన పడిన శ్రమను, సాధించిన విజయాలను వెండితెర...