భారతదేశం, మార్చి 22 -- ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత గౌరవనీయమైన, గొప్ప గుర్తింపు పొందిన వ్యక్తులలో ఒకరు. ఆయన హిందూ ధర్మ విలువలను, అలాగే సాధారణంగా మానవ ప్రవర్తనా విషయాలను బోధించే విధానం చాలా మందికి నచ్చుతుంది. జీవితానికి కావాల్సిన విషయాలను చక్కగా చెబుతుంటారు. ప్రస్తుత తరానికి కూడా అర్థమయ్యేలా.. ఫన్నీగా వివరిస్తారు.

అయితే ఈ తెలుగు పండితుడి తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై అనేకమంది విమర్శలు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి గరికపాటి వివాదాస్పద వైఖరిని వ్యక్తం చేస్తూ కనిపించారు. విద్యార్థులకు ప్రభుత్వం ఇలాంటి భోజనం అందించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

'విద్యార్థులకు యూనిఫారాలు, పుస్తకాలు, భోజనం అందించడానికి ప్రభుత్వం ఎందుకు డబ్బు ఖర...