భారతదేశం, మే 28 -- Ganguly Biopic: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ బయోపిక్ 'దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ' (Dada: The Sourav Ganguly Story) షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. బాలీవుడ్ వెర్సటైల్ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ముంబై షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కోల్‌కతాలో కీలకమైన 15 రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది.

ఈ బయోపిక్‌కు పక్కా నేటివిటీ, ప్రామాణికత తీసుకురావడానికి చిత్ర బృందం కోల్‌కతాలోని నిజమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతోంది. బెహలా సందుల నుండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాల వరకు 'దాదా' ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.

గంగూలీ పుట్టి పెరిగిన బెహలాలోని ఆయన సొంత నివాసంలోనే మంగళవారం (మే 26) తెల్లవారుజామున షూటింగ్ ప్రార...