భారతదేశం, సెప్టెంబర్ 16 -- సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిదిలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. గణేష్ నిమజ్జనం వేడుకల్లో భాగంగా జరిగిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘోరం స్థానికంగా తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని నింపింది.

పెద్దకంజర్ల గ్రామంలో పండుగ వాతావరణంలో వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపు జరిగింది. స్థానికులతో పాటు విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న నేరేడు చెరువు వద్దకు చేరుకున్న తర్వాత, విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసే క్రమంలో ఊహించని ప్రమాదం జరిగింది.

నీటి లోతును అంచనా వేయలేక ప్రమాదవశాత్తూ ఆరుగురు విద్యార్థులు చెరువులోకి జారిపడ్డారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాక వారు మునిగిపోయారు. గమనించిన స్థానికులు, గ్రామస్తులు రక్ష...