భారతదేశం, సెప్టెంబర్ 14 -- భాద్రపద శుద్ధ చవితి పర్వదినాన విఘ్న వినాశకుడైన వినాయకుని విశేష పూజలు నిర్వహించడం హిందూ సంప్రదాయం. బుద్ధి, సిద్ధి, సంపదలను ప్రసాదించే గణపయ్య పండుగ వేళ శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు కేవలం సాధారణ శుభాకాంక్షలు మాత్రమే కాకుండా.. శ్లోకాలతో విషెస్ తెలియజేస్తే ఆ దైవిక శక్తి, ఆధ్యాత్మిక శోభ రెట్టింపవుతాయి. శాస్త్రోక్తంగా గణపతిని ప్రసన్నం చేసుకునే అత్యంత పవిత్రమైన శ్లోకాలతో శుభాకాంక్షలు చెప్పండి.

ఈ పవిత్ర చవితి వేళ మీకు ఆ విఘ్నహరుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని, మీ దారిలోని ఆటంకాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు!

గణేష్ చతుర్థి సందర్భంగా మీరు ప్రారంభించే ప్రతి శుభ కార్యం నిర్విఘ్నంగా పూర్తయి, ఉన్నతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ చవితి శుభాకాంక్షలు!

ఆ ఏకదంతుడి దివ్యానుగ్రహంతో మీకు, మీ క...