భారతదేశం, మార్చి 3 -- జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్ట్ చేసిన సినిమా ఫంకీ. విశ్వక్సేన్, కయదు లోహర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజైనా ఆ స్థాయి వసూళ్లు సాధించలేకపోయింది. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సరిగ్గా నెల రోజుల తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ఫంకీ మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆశించిన మేర బాక్సాఫీస్ దగ్గర రాణించలేకపోయింది. కనీసం ఓటీటీలో అయినా మంచి రెస్పాన్స్ వస్తుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాను ఎలాంటి కథ లేకుండా కేవలం కామెడీ కోసమే తీసినట్లు నిర్మాత న...