భారతదేశం, ఏప్రిల్ 27 -- CM Chandrababu Naidu Review : రాష్ట్రంలో ఇందన కొరతతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. అయితే ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేమిటని ఆరా తీశారు.

ఉదయం నుంచి వివిధ ఆయిల్ డిస్పాచ్ సెంటర్ల నుండి వందలాది ట్యాంకర్లు బయలుదేరాయని.. అవి ఈ రోజు సాయంత్రం నాటికి అన్ని రిటైల్ బంకులకు చేరుకుంటాయని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ రోజు సాయంత్రం కల్లా మెజారిటీ ప్రాంతాల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి వస్తుందని హామీ ఇచ్చారు. అధికారులు, చమురు సంస్థలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఆందోళనను తొలగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కేవలం కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడం కాకుండా, కలెక్టర్లు మరియు ఉన్నతాధికారుల...