భారతదేశం, సెప్టెంబర్ 9 -- భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న మారుతీ సుజుకీ, పండుగల సీజన్‌ను పురస్కరించుకుని వరుస కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఇటీవల రూ. 6,09,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి తెచ్చిన 'బలెనో ఫేస్‌లిఫ్ట్'కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించింది. జీఎస్టి రేట్ల తగ్గింపు ప్రభావం, రిజర్వ్ బ్యాంక్ స్థిరమైన రెపో రేట్లు, పండుగల వేళ కస్టమర్లలో పెరిగిన కొనుగోలు ఉత్సాహాన్ని మారుతీ గరిష్టంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. బలెనో ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ ఊపుతో, ఇప్పుడు తన పాపులర్ క్రాసోవర్ ఎస్‌యూవీ 'ఫ్రాంక్స్' ఫేస్‌లిఫ్ట్‌ను కూడా మార్కెట్‌లోకి దించేందుకు ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రంగం సిద్ధం చేసింది!

ఫ్రాంక్స్ అనేది ప్రాథమికంగా బలెనో ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన క్రాసోవర్ మోడల్ కావడంతో.. ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ల...