భారతదేశం, ఏప్రిల్ 1 -- ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ పొందిన అమెరికన్ సిట్‌కామ్ 'ఫ్రెండ్స్' (Friends) అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే తీపి కబురు అందించింది. గతేడాది డిసెంబర్ 30న ఈ వెబ్ సిరీస్‌ను తన ప్లాట్‌ఫామ్ నుండి తొలగించిన నెట్‌ఫ్లిక్స్.. ఇప్పుడు మళ్ళీ స్ట్రీమింగ్ హక్కులను పునరుద్ధరించుకుంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ ప్రకటన రావడంతో చాలామంది ఇది 'ఏప్రిల్ ఫూల్స్ డే' ప్రాంక్ ఏమో అని సందేహించారు. కానీ ఇది నిజమేనని, అధికారికంగా ఈ సిరీస్ తిరిగి నెట్‌ఫ్లిక్స్ క్యాటలాగ్‌లోకి చేరిందని స్పష్టమైంది.

దాదాపు మూడు నెలల నిరీక్షణ తర్వాత 'ఫ్రెండ్స్' సిరీస్ లవర్స్ తమ అభిమాన షోను మళ్ళీ ఎంజాయ్ చేసే అవకాశం లభించింది. ఈ సిరీస్‌కు సంబంధించిన మొత్తం 10 సీజన్లు, అందులోని 236 ఎపిసోడ్లు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పాపులర్ ...