భారతదేశం, సెప్టెంబర్ 4 -- Friday Top Ott Releases: ఓటీటీ లవర్స్ ఎప్పుడెప్పుడు ఫ్రైడే వస్తుందా? అని వెయిట్ చేస్తుంటారు. శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు సందడి ఉంటే.. ఇక్కడ ఓటీటీలోనూ కొత్త రిలీజ్ ల జోరు ఉంటుంది. ఈ రోజు (సెప్టెంబర్ 4) ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ నుంచి మిస్టరీ వరకూ డిఫరెంట్ జోనర్ల సినిమాలు, సిరీస్ లు వచ్చాయి.

శుక్రవారం డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ ఉంది. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల కీలక పాత్రలు పోషించారు. కర్నాటిక్ సంగీత దిగ్గజం శాస్త్రి (ప్రకాష్ రాజ్) కుటుంబ వారసత్వాన్ని కాపాడుతూ, తన సొంత సంగీత శైలిని ఆవిష్కరించుకోవాలని తపించే ఒక యువకుడి (అక్షయ్) కథ ఇది.

శాస్త్రీయ సంగీతం, ఆధునిక శబ్దాల మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌ను సుస్మిత కొణిదెల ఎమోషనల్‌గా నిర్మించారు. సంగీతాభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కు ...