భారతదేశం, ఆగస్టు 6 -- Free OTT: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో కంటెంట్‌కు కొదవ లేదు. అయితే నాణ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలంటే నెలకు వందల రూపాయల సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. కానీ ఎలాంటి రుసుము లేకుండా, కేవలం యాడ్స్ ద్వారా పూర్తి సిరీస్‌లను ఉచితంగా అందించే ప్లాట్‌ఫామ్‌లలో అమెజాన్ MX ప్లేయర్ (Amazon MX Player) ముందంజలో ఉంది.

ఈ అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో మీరు ఉచితంగా వీక్షించగలిగే 7 అత్యుత్తమ వెబ్ సిరీస్‌ల వివరాలు ఇక్కడ చూడవచ్చు.

ప్రకాష్ ఝా దర్శకత్వంలో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన సంచలనం ఈ సిరీస్. స్వయంప్రకటిత దొంగ బాబాల సామ్రాజ్యం, ఆధ్యాత్మికత ముసుగులో జరిగే అక్రమాలు, రాజకీయాలు, క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఓటీటీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. కేవలం ర్య...