భారతదేశం, నవంబర్ 2 -- అమెరికాలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఒక దారుణమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 9 మంది ప్రయాణికులతో టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి బయలుదేరిన ఒక ప్రైవేట్ లియర్‌జెట్ విమానం, ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ నివాస ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న తొమ్మిది మందీ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు!

ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. అవి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ ఈ ప్రమాదాన్ని ధృవీకరిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరాలను వెల్లడించారు.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్​ఏఏ) నివేదిక ప్రకారం.. 'లియర్‌జెట్ 60' రకానికి చెందిన ఈ ప్రైవేట్ విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ...