భారతదేశం, మార్చి 3 -- పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ నుండి లండన్, అమెరికాకు విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. విమానయాన సంస్థలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. పెరుగుతున్న ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు, రద్దు, ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా పెంచాయి.

పలు ప్రాంతాల గగనతలంలో అంతరాయాల కారణంగా విమానయాన సంస్థలు విమానాలను దారి మళ్లించి, సేవలను సర్దుబాటు చేయడంతో ధరలు పెరిగాయి.

హైదరాబాద్ నుండి కీలకమైన యూరోపియన్ గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. మార్చి 3, మంగళవారం లండన్‌కు వన్-వే టిక్కెట్ ధరలు రూ.65,000 నుంచి రూ.90,000 మధ్య ఉన్నాయి. ఇది ఈ రూట్‌కు సాధారణ ఛార్జీ కంటే దాదాపు రెట్టింపు.

అదేవిధంగా జర్మనీలోని నగరాలకు ఛార్జీలు సాధారణ ధరలతో పోలిస్తే 200 నుండి 300 శాతం పెరిగాయి. విమానాల రూటింగ్, ప్రభావితమైన గగనతలం ద్వారా తగ్గిన సేవల...