Flex Fuel Bike : యామహా నుంచి సరికొత్త బైక్- రూ. 1.24 లక్షలకే ఇథనాల్‌తో నడిచే ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్!
భారతదేశం, జూలై 11 -- ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యామహా.. భారత మార్కెట్లోకి తన మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ 'యామహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్'ని అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త మోడల్ ప్రారంభ ధరను రూ. 1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్లో మంచి పాపులారిటీ ఉన్న ఎఫ్‌జెడ్ సిరీస్ ప్లాట్‌ఫామ్‌పైనే దీనిని రూపొందించారు. పెట్రోల్‌తో పాటు ఎక్కువ శాతం ఇథనాల్ కలిపిన ఇంధనంతో కూడా ఈ బైక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకెళ్తుంది.
యమహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లో రెగ్యులర్ ఎఫ్‌జెడ్ సిరీస్‌లో ఉండే నమ్మకమైన 149 సీసీ, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌నే ఉపయోగించారు. అయితే, ఇథనాల్ ఇంధనానికి అనుగుణంగా ఇందులో కొన్ని కీలక మార్పులు చేశారు. ఈ ఇంజన్ ఇప్పుడు 7,250 ఆర్పీఎమ్ వద్ద 11.7 హెచ్‌పీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.