భారతదేశం, జూలై 11 -- ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యామహా.. భారత మార్కెట్లోకి తన మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ 'యామహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్'ని అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త మోడల్ ప్రారంభ ధరను రూ. 1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్లో మంచి పాపులారిటీ ఉన్న ఎఫ్‌జెడ్ సిరీస్ ప్లాట్‌ఫామ్‌పైనే దీనిని రూపొందించారు. పెట్రోల్‌తో పాటు ఎక్కువ శాతం ఇథనాల్ కలిపిన ఇంధనంతో కూడా ఈ బైక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకెళ్తుంది.

యమహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లో రెగ్యులర్ ఎఫ్‌జెడ్ సిరీస్‌లో ఉండే నమ్మకమైన 149 సీసీ, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌నే ఉపయోగించారు. అయితే, ఇథనాల్ ఇంధనానికి అనుగుణంగా ఇందులో కొన్ని కీలక మార్పులు చేశారు. ఈ ఇంజన్ ఇప్పుడు 7,250 ఆర్‌పీఎమ్ వద్ద 11.7 హెచ్‌పీ...