భారతదేశం, జూన్ 20 -- దేశంలో ఇంధన ధరల భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ85 ఫ్యూయల్​ని లాంచ్​ చేసింది, ఈ100 కోసం నిబంధనలను సిద్ధం చేసింది. అయితే, పెట్రోల్​ కార్లలో ఇథనాల్ ఫ్యూయల్​ని వాడుతుంటే మైలేజ్, ఇంజిన్ సమస్యలు వంటివి వస్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ పెట్రోల్ కార్లను కూడా ఇథనాల్‌తో నడిచే 'ఫ్లెక్స్-ఫ్యూయల్' వాహనాలుగా మార్చే సరికొత్త సాంకేతికత త్వరలోనే దేశంలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది!

మన దేశంలోనే ఈ "ఇథనాల్ కన్వర్షన్ కిట్ల"ను తయారు చేస్తే, వినియోగదారులకు కేవలం రూ.15,000 లోపే లభించే అవకాశం ఉందని ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్​ఎంఏ) డైరెక్టర్ జనరల్ ...