భారతదేశం, అక్టోబర్ 18 -- Lawrence Bishnoi Gang Warning Over Tiger Shroff Firing: ముంబైలోని విలాసవంతమైన జూహు ప్రాంతంలో ఆదివారం (అక్టోబర్ 18) సాయంత్రం ఊహించని సంచలన ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ యంగ్ యాక్షన్ టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ముగ్గురు అపరిచిత వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు.

స్పోర్ట్స్ క్లబ్‌లో ఫుట్‌బాల్ ఆడి తిరిగొస్తున్న టైగర్ ష్రాఫ్, పుష్ప పార్క్ సమీపంలో తన బీఎమ్‌డబ్ల్యూ కారు ఎక్కే క్షణంలో దుండగులు ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామంలో టైగర్ క్షేమంగా తప్పించుకోగా, ఆయన డ్రైవర్ ఫిర్దోస్ సహా ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఫిర్దోస్ చేతికి తీవ్ర గాయమవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దారుణ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా దీనికి బాధ్యత వహిస్తూ సోషల...