భారతదేశం, జూన్ 30 -- ఫిఫా ప్రపంచకప్‌ 2026లో మరో అతిపెద్ద అద్భుతం ఆవిష్కృతమైంది! నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జర్మనీ జట్టును రౌండ్ ఆఫ్ 32 దశలోనే పరాగ్వే మట్టికరిపించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం (ఎక్స్‌ట్రా టైమ్) ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. అక్కడ ఒత్తిడిని జయించిన పరాగ్వే విజయం సాధించి తదుపరి దశకు అర్హత సాధించగా, జర్మనీ కన్నీళ్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఫిఫా చరిత్రలో రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు ఫైనల్‌కు చేరిన ఘనత జర్మనీకి ఉంది. అలాంటి దిగ్గజ జట్టు, ఏమాత్రం అంచనాలు లేని పరాగ్వే చేతిలో ఓడిపోవడం ఈ ఫిఫా వరల్డ్​ కప్ 2026 టోర్నమెంట్‌లోనే అత్యంత పెద్ద అప్‌సెట్‌గా నిలిచిపోతుంది.

నిజానికి ఎక్స్‌ట్రా టైమ్‌లో జర్మనీ ప్లేయర్ జోనాథన్ టా కొట్టిన విన్నింగ్ గోల్‌ను రెఫరీ వివా...