భారతదేశం, జూన్ 25 -- ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుండటంతో భారతీయ ఫుట్‌బాల్ అభిమానులు సైతం అర్ధరాత్రి దాటినప్పటికీ నిద్రను త్యాగం చేసి మరీ తమ అభిమాన జట్లను ఉత్సాహపరుస్తున్నారు. ఈ లీగ్ ఒకవైపు వినోదాన్ని, సంతోషాన్ని ఇస్తున్నప్పటికీ, దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ టోర్నీలో నిరంతరం నిద్రను దూరం చేసుకోవడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఒకటి రెండు మ్యాచ్‌ల కోసం రాత్రి పూట మేల్కొనడం పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ వారాల తరబడి నిరంతరం నిద్రలేమితో గడపడం వల్ల శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుందని విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ లోకేష్ గుట్ట తెలిపారు. నిద్రలేమి వల్ల వచ్చే ఆరోగ్య నష్టాలు, వాటి నుంచి మనల...