భారతదేశం, జూన్ 20 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే, ప్రతి ఒక్కరూ మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. ప్రతి రాశి వ్యక్తిత్వంపై ఆ రాశికి అధిపతిగా ఉన్న గ్రహ ప్రభావం పడుతుంది. ఈ గ్రహాధిపతి ప్రకారం వ్యక్తిలో కొన్ని శక్తులు, కొన్ని భయాలు ఉంటాయి. కొన్ని రాశుల వారికి అవి బలాలు అయితే, అదే కొన్ని రాశులకు బలహీనతలు కావచ్చు. గ్రహాల అనుకూలతతో ధైర్యం, సాహసం, నాయకత్వ లక్షణాలు పెంచుకోవచ్చు. ఈ లక్షణాల కారణంగా జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని రాశుల వారికి పెద్దగా భయం ఉండదు. అదే ఆ రాశుల ప్రత్యేకత. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా ఉండగలరు. మరి ఆ రాశుల వారు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారు కుజుడి ప్రభావంతో ధైర్యసాహసాలను కలిగి ఉంటారు. అపారమైన శక్తితో ఉం...