భారతదేశం, నవంబర్ 5 -- సొంత నిధులను సురక్షితమైన మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తూ స్థిరమైన రాబడి పొందాలనుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్​డీ) పెట్టుబడిదారులకు ప్రముఖ బ్యాంకులు శుభవార్త అందించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ 7న నిర్వహించిన పరపతి సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చిన నిర్ణయం ప్రభావం ఇప్పుడు మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రభుత్వ, ప్రైవేట్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను వరుసగా సవరిస్తున్నాయి.

2026 నవంబర్ నెలలో కొటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ డిపాజిట్లపై సవరించిన నూతన వడ్డీ రేట్లను అమలులోకి తెచ్చాయి. సాధారణ డిపాజిట...