భారతదేశం, నవంబర్ 23 -- పదవీ విరమణ తర్వాత చేతిలో ఉన్న పొదుపు సొమ్మును సురక్షితంగా దాచుకుంటూ, ప్రతినెలా లేదా ఏటా స్థిరమైన ఆదాయం పొందాలని ప్రతి సీనియర్ సిటిజన్ కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ఎంపిక చేసిన కొన్ని 'స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు' ఐదేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్​డీ) ఏకంగా 8.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ముందుగానే ఊహించదగిన స్థిర రాబడిని అందిస్తూ, నిర్ణీత కాలంలో పొదుపు నిధులను పెంచుకోవడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎప్పటికీ నమ్మదగిన సాధనాలుగా నిలుస్తున్నాయి. రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లపై పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రకటించాయి. అయితే అధిక వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, తమ కష్టార్జితాన్ని జ...