Faria Abdullah: కంటతడి పెట్టిన చిట్టి.. తెలంగాణ కల్చర్ గురించి చెబుతూ ఎమోషనల్.. బోనాల పండుగలో ఫరియా మాస్ స్టెప్స్
భారతదేశం, ఆగస్టు 10 -- Faria Abdullah Emotional Bonalu: హైదరాబాద్లోని మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా సందడి చేశారు. పక్కా తెలంగాణ అమ్మాయిలా అమ్మవారి దర్శనం చేసుకుని ఊరమాస్ డప్పు చప్పుళ్లకు క్రేజీ స్టెప్పులేస్తూ అభిమానులను ఖుషీ చేశారు. తెలంగాణ సంస్కృతిని చూసి తాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని, ఇక్కడి ప్రజల ఆప్యాయత ప్రపంచంలో ఎక్కడా దొరకదని సంతోషం వ్యక్తం చేశారు.
ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగరంలో బోనాల పండుగ వాతావరణం అంబరాన్ని తాకింది. హైదరాబాద్ పాతబస్తీలోని ప్రసిద్ధ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు ఫరియా అబ్దుల్లా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.