భారతదేశం, జూన్ 27 -- మన ఇంట్లో సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ లేదా చిన్నపాటి ఐదు సీట్ల ఎస్‌యూవీలు సరిపోవు. అందరూ కలిసి ప్రయాణించాలంటే కచ్చితంగా ఒక మంచి 7-సీటర్ ఎంపీవీ ఉండాల్సిందే. ఈ విభాగంలో దశాబ్ద కాలంగా తిరుగులేని రారాజుగా వెలుగుతోంది 'మారుతీ సుజుకీ ఎర్టిగా'. సౌకర్యవంతమైన ప్రయాణం, ఈజీ డ్రైవింగ్, నమ్మకమైన మైలేజీ దీని సొంతం. అయితే, ఎర్టిగా లైనప్‌లో అన్నింటికంటే 'జెడ్​ఎక్స్ఐ' వేరియంట్ కొనుగోలు చేయడం అత్యంత తెలివైన నిర్ణయం అని చెప్పవచ్చు. టాప్-ఎండ్ వేరియంట్ అయిన జెడ్​ఎక్స్ఐ+ కంటే ఇది ఏ విధంగా బెస్ట్ చాయిస్ అవుతుందో పూర్తి వివరాల్లో చూద్దాం.

మారుతీ సుజుకీ కార్లలో ఎల్లప్పుడూ బడ్జెట్ ఫ్రెండ్లీ, వాల్యూ-ఫర్-మనీ ఆప్షన్లకు డిమాండ్ ఎక్కువ. ఎర్టిగా మోడల్‌లో 'జెడ్​ఎక్స్ఐ' వేరియంట్ సరిగ్గా ఇలాంటి ఫీచర్లనే అందిస్తుంది. ఇ...