భారతదేశం, మార్చి 15 -- బాలీవుడ్ విలక్షణ నటుడు, సైంధవ్ మూవీ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి నిక్కచ్చిగా మాట్లాడే తత్వంతో ఇండస్ట్రీలో చర్చకు తెరలేపారు. హిందీ సినిమాల్లో నిజాయితీ తగ్గిపోయిందని, అంతా 'నకిలీ' మయం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ చర్చా వేదికపై నవాజుద్దీన్ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. సమాజాన్ని చైతన్యపరచడంలో సినిమాల పాత్రపై నవాజుద్దీన్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ, కథల్లో నిజాయితీ ఉండటం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు.

"సమాజాన్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు. నిజం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం వస్తున్న సినిమాల వెనుక ఉన్న అసలు సత్యం ఏంటో ప్రతి ఒ...