భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఓటీటీలో కేవలం తెలుగు కంటెంట్ అందించే ఈటీవీ విన్ ఇప్పుడు సరికొత్తగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈటీవీ విన్ 3.0ను శుక్రవారం (ఫిబ్రవరి 27) అనౌన్స్ చేశారు. కొత్త లుక్, కొత్త స్పీడ్ తో రీలాంచ్ చేస్తూనే సరికొత్త ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ ను తీసుకొస్తున్నట్లు కూడా ఆ ఓటీటీ వెల్లడించింది.

ప్రముఖ తెలుగు ఛానెల్ ఈటీవీ నుంచి వచ్చిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win). గత కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఓటీటీ స్పేస్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ఈటీవీ విన్ 3.0ను లాంచ్ చేసింది.

"కొత్త లుక్.. కొత్త స్పీడ్.. కొత్త మ్యాడ్‌నెస్.. ఇది కేవలం అప్డేట్ మాత్రమే కాదు. ఇది అప్‌గ్రేడ్. ఈటీవీ విన్ 3.0 వచ్చేసింది. వేగవంతమైన స్ట్రీమింగ్. మరింత మంచి అనుభవం. మరిం...