భారతదేశం, జూలై 19 -- Etv Jabardasth: తెలుగు బుల్లితెరపై గత దశాబ్ద కాలంగా నవ్వుల పంట పండిస్తూ, రేటింగ్స్‌లో దూసుకుపోతున్న మల్లెమాల ప్రొడక్షన్స్ ఐకానిక్ కామెడీ షో 'జబర్దస్త్' ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ షో టెలికాస్ట్ అయ్యే రోజు, టైమ్ పూర్తిగా మారిపోయింది.

పాపులర్ కామెడీ షో జబర్దస్త్ టీవీలో టెలికాస్ట్ అయ్యే టైమ్ మారింది. మొన్నటి వరకూ శుక్ర, శనివారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కామెడీ షో స్టార్ట్ అయ్యేది. కానీ ఇకపై ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ షో స్టార్ట్ కానుంది. జూలై 26 నుంచి కొత్త టైమింగ్ స్టార్ట్ కానుంది. వీకెండ్ స్లాట్ కు జబర్దస్త్ షిప్ట్ అయింది. ఈ అనౌన్స్ మెంట్ ను స్పెషల్ ప్రోమో ద్వారా ఈటీవీ ప్రకటించింది.

13 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ జబర్దస్త్ షో మొదట్లో కేవలం గురువారం రాత్రి మాత్రమే వచ్చేది. ఆ తర్వాత క్రేజ్ దృష్ట్య...