భారతదేశం, ఆగస్టు 5 -- Epic Release Date: టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్ కొట్టిన 'బేబి' కాంబో మళ్లీ థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమైపోయింది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), హాట్ బ్యూటీ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త యూత్‌ఫుల్ కాలేజ్ డ్రామా 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు.

ఈ రిలీజ్ డేట్ వెనుక ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ దాగుంది. మొదట అదే సెప్టెంబర్ 11వ తేదీని విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'రణబాలి' కోసం అనుకున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో, ఆ స్లాట్‌ను తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన 'ఎపిక్' సినిమాతో భర్...