భారతదేశం, అక్టోబర్ 6 -- Epic OTT: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన సరికొత్త రొమాంటిక్ డ్రామా మూవీ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' (Epic - First Semester) ఓటీటీ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ ఎపిక్ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. అక్టోబర్ 9 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం మరో మూడు రోజుల్లోనే వీక్షకులకు అందుబాటులోకి రాబోతోంది.

ఎపిక్ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన రోహన్ అనే విద్యార్థి చు...