భారతదేశం, సెప్టెంబర్ 19 -- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సభ్యుల కోసం సేవలను మరింత సులభతరం చేసేందుకు కొన్ని ముఖ్యమైన సంస్కరణలను చేపట్టింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా సెప్టెంబర్ 18, 2025న ప్రారంభించిన ఈ కొత్త ఫీచర్లలో 'పాస్‌బుక్ లైట్', 'అనెక్సర్-కె' డౌన్‌లోడ్ సౌకర్యం ప్రధానమైనవి.

సాధారణంగా పీఎఫ్ సభ్యులు తమ పాస్‌బుక్ వివరాలు తెలుసుకోవడానికి వేరే పోర్టల్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు సర్వర్‌పై ఒత్తిడి పెరిగి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు EPFO తమ సభ్యుల పోర్టల్‌ లోనే (Member Portal) 'పాస్‌బుక్ లైట్' సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌ను

ఈ కొత్త ఫీచర్‌తో పీఎఫ్ ఖాతాదారులు తమ కాంట్రిబ్యూషన్స్ (కలిపిన మొత్తం), విత్‌డ్రాయల్స్ (తీసుకున్న మొత్తం), మరియు ప్రస్తుత బ్యాలెన్స్ వంటి ముఖ్యమైన సమాచ...