భారతదేశం, మార్చి 7 -- టాలీవుడ్‌లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మొన్న రష్మిక-విజయ్ దేవరకొండ, నిన్న అల్లు శిరీష్.. ఇలా వరుసగా యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండటంతో తెలుగు చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది.

ఈ క్రమంలోనే మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. అతనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇటీవల కిష్కింధపురి సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లికి సంబంధించిన చర్చలు ఇప్పటికే ఇంట్లో పూర్తయ్యాయని, రేపే అంటే మార్చి 8నే నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని సమాచారం. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను ఏకాంతంగా నిర్వహించాలని భావిస్తున్నారట. ఎంగేజ్‌మెంట్ పూర్తయిన వెంటనే పెళ్లి తేద...