భారతదేశం, జూన్ 29 -- ENE Repeat Release Date: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన బెస్ట్ సినిమాల్లో 'ఈ నగరానికి ఏమైంది' (Ee Nagaraniki Emaindi) కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా డిజిటల్ స్క్రీన్స్, ఓటీటీలలోనూ యువతను విపరీతంగా ఆకట్టుకుని ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.

ఇప్పుడు 'ఈ నగరానికి ఏమైంది' మూవీ సీక్వెల్ రాబోతుంది. 'ఈఎన్ఈ రిపీట్' పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోమవారం (జూన్ 29) ఈఎన్ఈ రిపీట్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ నగరానికి ఏమైంది మూవీ రిలీజై 8 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా ఈఎన్ఈ రిపీట్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ క్రేజీ సీక్వెల్ నవంబర్ 19, 2026న థియేటర్లకు రానుంది.

ఈ సీక్వెల్ మూవీని నవంబర్ 19, 2026న ప్రపంచవ...