భారతదేశం, నవంబర్ 23 -- Srinath Maganti Impress As Karthik ENE Repeat: తెలుగు యువతకు ఆల్‌టైమ్ ఫేవరెట్ కల్ట్ కామెడీ చిత్రాల్లో 'ఈ నగరానికి ఏమైంది' (ENE) స్థానం ప్రత్యేకం. హైదరాబాద్ వీధుల్లో నలుగురు స్నేహితుల మధ్య సాగే ఆ సరదా ప్రయాణానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైంది 2' (ENE రిపీట్) ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.

ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న వేళ, అందరి దృష్టి నటుడు శ్రీనాథ్ మాగంటిపై నిలిచింది. తొలి భాగంలో సుశాంత్ రెడ్డి పోషించిన 'కార్తీక్' పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వ్యక్తిగత కారణాలు, కుటుంబ వ్యాపారాలపై దృష్టి పెట్టాల్సి రావడంతో సుశాంత్ రెడ్డి ఈ సీక్వెల్ నుంచి తప్పుకున్నారు. దాంతో ఆ స్థానంలో శ్రీనాథ్ మాగంటిని ఎంపిక చేసినట్లు చిత్ర బృంద...