భారతదేశం, సెప్టెంబర్ 24 -- Endhayya Saami Lyrics: రియల్ కపుల్ రీల్ రొమాన్స్ కు వేదికగా నిలిచింది 'ఏందయ్యా సామి' సాంగ్. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' మూవీ నుంచి లేటెస్ట్ గా ఈ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజైంది. గతంలో ఈ పాటలోని కొన్ని లైన్స్ రిలీజ్ చేసినప్పుడే ఇది ట్రెండింగ్ గా మారింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ మరో లెవల్ లో ఉంది.

రణబాలి మూవీలోని ఏందయ్యా సామి సాంగ్ మంచి ఫీల్ తో సాగుతోంది. ఇందులోని అక్షరాలు మనసును తాకుతున్నాయి. కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య రొమాన్స్ ను ఈ సాంగ్ చాటుతోంది. ఈ పాటను సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా రాశారు. అజయ్ గోగావలే, శ్వేత మోహన్ అమోఘంగా పాడారు. ఫుల్ లిరిక్స్ ఇక్కడున్నాయి.

ఏందయ్య సామీ ఇట్ట గాస్తాంది ఎన్నెలా

ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాలా

వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు

మారేజాముకి మందు పెట్ట...