భారతదేశం, నవంబర్ 16 -- అనుకోకుండా ఉద్యోగం పోయినా, కుటుంబంలో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం చేసినా, ఇంటికి సంబంధించిన భారీ ఖర్చులు వచ్చిపడినా మనల్ని ఆదుకునేది ఎమర్జెన్సీ ఫండ్ (అత్యవసర నిధి) మాత్రమే! నేటి కాలంలో కనీసం రూ.10 లక్షల అత్యవసర నిధి ఉంటే ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు అని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ మొత్తాన్ని ఎక్కడ దాచాలన్నదే అసలు సవాలు. మొత్తం డబ్బును సేవింగ్స్ ఖాతాలో ఉంచితే వడ్డీ చాలా తక్కువగా వస్తుంది. అలాగని పూర్తిగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్​డీ) లేదా మ్యూచువల్ ఫండ్లలో లాక్ చేస్తే, అర్ధరాత్రి ఆసుపత్రి ఖర్చులకు డబ్బు అవసరమైనప్పుడు వెంటనే తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబాలు, ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు ఈ ప్రణాళిక ఎంతో అవసరం. కార్పొరేట్ ఆ...