భారతదేశం, మే 2 -- Tata Sierra EV launch : భారత ఆటోమొబైల్ రంగం ఇప్పుడు 'గ్రీన్ ఎనర్జీ' వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు కేవలం చిన్న కార్లకే పరిమితమైన ఎలక్ట్రిక్ టెక్నాలజీ, ఇప్పుడు భారీ ఎస్‌యూవీల్లోనూ కనిపిస్తోంది. కేవలం పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలను కూడా కంపెనీలు భారత మార్కెట్​లోకి తెస్తున్నాయి. రాబోయే పండుగ సీజన్ నాటికి మన దేశంలో విడుదల కానున్న టాప్-5 మోడల్స్ ఇవే..

టయోటా సంస్థ భారత్‌లో విడుదల చేయనున్న మొట్టమొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ఇదే. ఇది మారుతీ సుజుకీ'ఈ-విటారా' ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపొందింది. ఎబెల్లా రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. ఒకటి 440 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, మరొకటి ఏకంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని డిజైన్ చాలా ఎలిగెంట్‌గా, మోడ్రన్‌గా ఉంటుందని కంపెనీ చెబ...