భారతదేశం, జూన్ 30 -- భారతదేశంలో పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతుండటంతో, టూ-వీలర్ కొనుగోలుదారులు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది మే నెలలో పెట్రోల్ ధరల ప్రభావంతో చాలామంది కస్టమర్లు ఇంధన వాహనాల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఒక మంచి ఈవీ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తూ.. మార్కెట్లో పాపులర్ అయిన టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, విడా వీఎక్స్2 మోడళ్లను షార్ట్‌లిస్ట్ చేసుకున్నారా? అయితే, ఏ మోడల్‌కు ఎంత నెలవారీ ఈఎంఐ కట్టాలో తెలియక అయోమయంలో ఉన్నారా? మీకోసమే వేరియంట్ల వారీగా ఈ క్లియర్ అండ్ కాంప్రహెన్సివ్ కంపారిజన్.

కస్టమర్లకు సులభంగా అర్థం కావడం కోసం.. ఇక్కడ పేర్కొన్న మూడు స్కూటర్ల అన్ని వేరియంట్లను పరిగణనలోకి తీసుకున్నాం. ఇందులో టీవీఎస్ ఐక్యూబ్ మూడు వేరియంట్లలో (ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐ...