భారతదేశం, జూలై 7 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి మధ్యతరగతి వాహనదారులు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫైబర్ బాడీతో రావడం వల్ల చిన్న ప్రమాదం జరిగినా ప్యానెల్స్ విరిగిపోయి భారీగా ఖర్చవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఈవీ తయారీ సంస్థ 'కొమాకి' సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. మధ్యతరగతి బడ్జెట్‌కు సరిపోయేలా, అత్యంత ధృడమైన బాడీతో రెండు సరికొత్త స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

కొమాకి సంస్థ భారత మార్కెట్లో 'ఎంజీ ప్రో వీ', 'ఎంజీ ప్రో ప్లస్' అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను అధికారికంగా విడుదల చేసింది. రూ. 73,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభించే ఈ ఈ-స్కూటర్లు బడ్జెట్ పరిధిలోనే ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.

ప్రస్తుతం విక్రయాల్...