భారతదేశం, జూన్ 12 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) రోజురోజుకూ డిమాండ్ ఎంతలా పెరుగుతోందో చెప్పడానికి తాజా గణాంకాలే నిదర్శనం! ప్రముఖ దేశీయ టూ-వీలర్ దిగ్గజం 'టీవీఎస్ మోటార్ కంపెనీ' ఈవీ మార్కెట్​లో ఒక అరుదైన, చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. భారత మార్కెట్​లో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల మొత్తం విక్రయాలు ఏకంగా 10 లక్షల మార్కును దాటాయి. దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ఈ అద్భుత ఘనత సాధించిన రెండో కంపెనీగా టీవీఎస్ రికార్డు సృష్టించింది.

గత కొన్ని ఏళ్లుగా భారత ఈవీ రంగం ఎంత వేగంగా విస్తరిస్తోందో చెప్పడానికి ఈ నంబర్లే నిదర్శనం.

ప్రభుత్వ అధికారిక 'వాహన్' రిజిస్ట్రేషన్ల పోర్టల్​లోని తాజా డేటా ప్రకారం.. టీవీఎస్ మోటార్ కంపెనీ 2020 జనవరిలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సంస్థ మొత్తం 10,04,148 ...