భారతదేశం, జూలై 23 -- దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ యమహా.. ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్​ పెంచింది. ఇందులో భాగంగానే కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన డిజైన్ పేటెంట్‌ను యామహా జపాన్‌లో తాజాగా దాఖలు చేసింది. ఆన్​లైన్‌లో లీకైన ఈ పేటెంట్ చిత్రాలు, స్కూటర్‌కు సంబంధించిన కీలక అంశాలను స్పష్టం చేస్తున్నాయి.

భారత టూ-వీలర్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ఆదరణ రోజురోజుకూ ముమ్మరమవుతోంది. బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ వంటి పాత దిగ్గజ సంస్థలు తమ ఈవీ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తున్నాయి. కాగా ప్రస్తుతం యామహా భారత మార్కెట్లో 'ఏరాక్స్-ఈ', 'ఈసీ-06' అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. దేశంలో ఈవీలకు ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా భారత లైన...