Electric scooter : అఫార్డిబుల్ ధరకు ఏథర్ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్- ఐక్యూబ్, చేతక్‌కి గట్టి పోటీ!
భారతదేశం, జూన్ 28 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. ప్రముఖ ఈవీ దిగ్గజం 'ఏథర్ ఎనర్జీ' సామాన్యులను టార్గెట్ చేస్తూ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన తదుపరి, సరికొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ కమ్యూనిటీ డే 2025లో ప్రదర్శించిన 'ఈఎల్01' కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా దీని ఉత్పత్తి వెర్షన్‌ను రూపొందిస్తున్నారు. పండుగ సీజన్ నాటికి ఈ సరికొత్త ఈవీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్‌కి సంబంధించిన డిజైన్ పేటెంట్ హక్కులను ఏథర్ పొందింది. అంతేకాకుండా, భారతీయ రోడ్లపై ఇది టెస్టింగ్ జరుపుకుంటూ పలుమార్లు కెమెరాలకు చిక్కింది.
ఏథర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన 450 సిరీస్ స్కూటర్లు స్పోర్టీ లుక్‌తో యువతను ఆకట్టుకోగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.