భారతదేశం, ఏప్రిల్ 20 -- Viper electric cycle : నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు, పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా మార్గాల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ-సైకిల్ తయారీ సంస్థ 'ఈ-మోటరాడ్'.. తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ నేపథ్యంలో 'వైపర్' పేరుతో ఒక శక్తివంతమైన ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఇటీవలే మార్కెట్​లోకి తీసుకొచ్చింది. కేవలం పట్టణ ప్రయాణాలకే కాకుండా, కొంచెం కఠినమైన దారుల్లో (ఆఫ్​-రోడ్​) కూడా సాఫీగా సాగేలా దీన్ని రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్​ విశేషాలను ఇక్కడ చూసేయండి.

ఈ వైపర్ ఎలక్ట్రిక్ సైకిల్‌లో 48వీ 250డబ్ల్యూ రేర్ హబ్ మోటార్‌ను అమర్చారు. దీనికి తోడు 15.6ఏహెచ్ సామర్థ్యం గల 'రిమూవబుల్' బ్యాటరీని అందించారు. అంటే మీరు బ్యాటరీని సైకిల్ నుంచి విడదీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు.

పెడల్ అసిస్ట్ ...