భారతదేశం, మే 28 -- Vinfast VF 8 electric SUV : భారతదేశపు ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం సృష్టిస్తున్న వియత్నామీస్ కార్ల తయారీ సంస్థ 'విన్‌ఫాస్ట్'.. దేశీయంగా తన పట్టును బలపరుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, తన సరికొత్త సెకండ్ జనరేషన్ 'విన్‌ఫాస్ట్ వీఎఫ్ 8' లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్‌ను భారత్‌లో అధికారికంగా పేటెంట్ చేసింది. గ్లోబల్ మార్కెట్​లో విడుదలైన కొద్దిరోజులకే ఈ మోడల్‌ను ఇక్కడ పేటెంట్ చేయడం చూస్తుంటే.. కంపెనీ దీనిని భారతలో తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా (వీఎఫ్ 7 కంటే పైన) లాంచ్ చేసేందుకు పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది.

విన్‌ఫాస్ట్ పోర్ట్‌ఫోలియోలోనే సరికొత్త రెండవొ తరం డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తున్న మొదటి మోడల్ ఈ 2026 వీఎఫ్ 8. పాత మోడల్‌తో పోలిస్తే దీని ఎక్స్‌టీరియర్ లుక్, ఇంటీరియర్ టెక్నాలజీలో కంపెనీ విప్లవాత్మక మార్ప...