భారతదేశం, సెప్టెంబర్ 15 -- భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు చైనా ఆటో దిగ్గజం 'బీవైడీ' ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటివరకు సాధారణ ఈవీలతో ఆకట్టుకున్న ఈ సంస్థ, ఇప్పుడు తన గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ 'డెంజా'ను దేశీయ మార్కెట్లోకి పరిచయం చేయబోతోంది! ఇందులో భాగంగా అసాధారణ పవర్, సరికొత్త ఫీచర్లు కలిగిన 'డెంజా జెడ్9 జీటీ' మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

మార్చి 2025లోనే ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్ పేటెంట్‌ను భారత్‌లో నమోదు చేసింది. ఇక భారత్‌లో లగ్జరీ ఈవీలకు ఆదరణ పెరుగుతున్న వేళ టయోటా వెల్‌ఫైర్, లెక్సస్ ఎల్ఎం వంటి అతిపెద్ద విలాసవంతమైన కార్లకు పోటీగా బీవైడీ ఈ తన డెంజా జెడ్9 జీటీని తీసుకొస్తోంది.

బీవైడీ డెంజా జెడ్9 జీటీ ఎలక్ట్రిక్ కారు పనితీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! ఇందులో 122.5 kWh సామర్థ్యం క...