Electric bike : సింగిల్ ఛార్జ్‌తో 343 కి.మీ రేంజ్- అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్ ఎలక్ట్రిక్ బైక్ హైలైట్స్
భారతదేశం, అక్టోబర్ 23 -- భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ 'అల్ట్రావయోలెట్' కొత్త స్పోర్ట్స్ బైక్‌ను పరిచయం చేసింది. 'అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్' పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను రూ.2.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మొదట బుకింగ్ చేసుకునే 5,000 మంది వినియోగదారులకు మాత్రమే ఈ ప్రారంభ ధర వర్తిస్తుందని స్పష్టం చేసింది. అక్టోబర్ 22న సాయంత్రం 4 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం కాగా, నవంబర్ నుంచి డెలివరీలు కూడా మొదలవుతాయి.
సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన కొత్త 'వీఎక్స్-100 100వీ' హై-వోల్టేజ్ ఆర్కిటెక్చర్ వేదికపై రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే కావడం విశేషం. భవిష్యత్తులో రాబోయే పలు వాహనాలకు ఇదే ప్లాట్‌ఫామ్ ప్రాతిపదికగా నిలవనుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.