భారతదేశం, అక్టోబర్ 23 -- భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ 'అల్ట్రావయోలెట్' కొత్త స్పోర్ట్స్ బైక్‌ను పరిచయం చేసింది. 'అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్' పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను రూ.2.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మొదట బుకింగ్ చేసుకునే 5,000 మంది వినియోగదారులకు మాత్రమే ఈ ప్రారంభ ధర వర్తిస్తుందని స్పష్టం చేసింది. అక్టోబర్ 22న సాయంత్రం 4 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం కాగా, నవంబర్ నుంచి డెలివరీలు కూడా మొదలవుతాయి.

సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన కొత్త 'వీఎక్స్-100 100వీ' హై-వోల్టేజ్ ఆర్కిటెక్చర్ వేదికపై రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే కావడం విశేషం. భవిష్యత్తులో రాబోయే పలు వాహనాలకు ఇదే ప్లాట్‌ఫామ్ ప్రాతిపదికగా నిలవనుంది...