భారతదేశం, జూన్ 21 -- భారతదేశ ఈవీ మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ దూసుకురాబోతోంది. ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'అవోర్ ఎలక్ట్రిక్' ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ బైక్​కి సంబంధించిన మొదటి అధికారిక టీజర్‌ తాజాగా బయటకు వచ్చింది. ఈ సరికొత్త బైక్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాహన ప్రియులకు ఈ టీజర్ ద్వారా కంపెనీ ఫస్ట్ లుక్‌ను పరిచయం చేసింది. అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ ఇంజనీరింగ్ ప్రమాణాలు, వినూత్నమైన డిజైన్‌ను మిళితం చేస్తూ ఈ బైక్‌ను తయారు చేసినట్లు కంపెనీ తన దార్శనికతను చాటిచెప్పింది.

అవోర్ ఎలక్ట్రిక్ విడుదల చేసిన ఈ చిన్న టీజర్ వీడియోలో ఈ- బైక్ డిజైన్, ఆకర్షణీయమైన రూపాన్ని విభిన్న కోణాల నుంచి చూపించారు. కంటిని ఆకట్టుకునేలా యాంగ్యులర్ స్కల్ప్​టెడ్ బాడీ ప్యానెల్, సరికొత్త డిజైన్‌తో క...