Election commission : ఓటర్ల జాబితాలో పేరు పోయిందా? ఈసీ కీలక ఆదేశాలు.. మళ్లీ దరఖాస్తుకు ఛాన్స్!
భారతదేశం, అక్టోబర్ 2 -- ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయిన పౌరులకు, నూతన ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పూర్తయిన 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులైన వారందరినీ తిరిగి నమోదు చేసేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు (స్పెషల్ డ్రైవ్స్) చేపట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది.
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి దాదాపు 13 కోట్ల పేర్లను తొలగించారు. ఈ తొలగింపులపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తొలగించిన పేర్లన్నీ అనర్హులవని భావించలేమని, సాంకేతిక సరిచూపులు లేదా విచారణ నిమిత్తం ముసాయిదా నుంచి తొలగించిన వాటిలో అర్హులైన ఓటర్లు కూడా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.