El Nino : వచ్చే ఫిబ్రవరి వరకు తీవ్రంగా ఎల్నినో ప్రభావం.. అవసరమైతే క్రాప్ హాలిడే
భారతదేశం, అక్టోబర్ 15 -- తెలంగాణపై ఎల్నినో(El Nino) ప్రభావం తీవ్రంగా ఉందని, రాబోయే ఏడాది ఫిబ్రవరి నెల నాటికి ఇది ఎక్కువగా ఉండనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆందోళన వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాల వైఫల్యం, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరగడానికి ఎల్నినోనే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లా పరిధిలోని సింగూర్, మంజీరా జలాశయాలను సందర్శించిన సీఎస్, క్షేత్రస్థాయిలో నీటి నిల్వలు, పంటల పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
సింగూర్ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం సీఎస్ సంజయ్ జాజు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం చేతికి వచ్చే దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి రాబోయే 15 నుంచి 20 రోజులు అత్యంత కీలకమని తెలిపారు. వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, ఇతర సంబంధిత శాఖల అధికార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.