భారతదేశం, అక్టోబర్ 13 -- Egilivaranga song Lyrics: తెలంగాణ పాటలకు, ఇక్కడి సాహిత్యానికి ఇప్పుడు తెలుగు సినిమాల్లో గొప్ప స్థానం దక్కుతోంది. తెలంగాణ జానపదాలు ఇప్పుడు బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. ఆ క్రమంలోనే శర్వానంద్ మూవీ 'భోగి'లో నుంచి ఇటీవల 'ఎగిలివారంగా' సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

భోగి మూవీ నుంచి వచ్చిన ఎగిలివారంగా సాంగ్ తెలంగాణ మట్టి వాసనను చాటుతోంది. ఇక్కడి మనుషులు, ఆచార సంప్రదాయాలు, కుల‌వృత్తులను ప్రస్తావిస్తూ సాగుతోంది. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన ఈ పాట సాహిత్యం అద్భుతంగా ఉంది. నల్లొండ గద్దర్ నర్సన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ అంతే అమోఘంగా పాడారు. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.

ఎగిలివారంగ లేసి

ఇల్లలికి పూధిచ్చి

ఇల్లలికి పూధిచ్చి

దీగుట్ల దేవతలకు దీపాలు ముట్టించి

దీపాలు ముట్టించి

కొట్టంలో బర్లు గొడ్లకు కుడితీనే...